ఎలాంటి ఆధారాలు లేకుండా బస్సులో తీసుకెళ్తున్న 48 లక్షల రూపాయలను కర్నూలులో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు సమీపంలోని పంచలింగాల చెక్ పోస్టు వద్ద రాత్రి ఎస్ఈబీ పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో జబ్బార్ ట్రావెల్స్ బస్సులో సిద్ధేశ్వర్ అనే వ్యక్తి 48లక్షల 22 వేల రూపాయలను హైదరాబాద్ నుంచి బెంగళూరుకు తరలిస్తున్నట్లు గుర్తించారు. అతనిని విచారించగా నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో పోలీసులు నగదును స్వాధీనం చేసుకున్నారు.
ప్రయాణికుడి నుంచి రూ. 48 లక్షలు స్వాధీనం
హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న బస్సులో పోలీసులు 48 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఆ నగదుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో వాటిని సీజ్ చేశారు. కర్నూలు సమీపంలోని పంచలింగాల చెక్ పోస్టు వద్ద ఎస్ఈబీ పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీలో ఈ నగదు పట్టుబడింగి.
ప్రయాణికుడి నుంచి రూ. 48 లక్షలను స్వాధీనం చేసుకున్న కర్నూలు పోలీసులు