Friends who killed a friend: తన ఫోన్లోంచి ప్రియురాలి నగ్న వీడియోలు సంపాదించి, వాటితో ఆమెను బ్లాక్ మొయిల్ చేసిన స్నేహితుడిని మరో మిత్రుడితో కలిసి కడతేర్చాడు ఓ యువకుడు. కర్నూలు నగరంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. కర్నూలు మండలం బాలాజీ నగర్‌కు చెందిన ఎరుకలి దినేశ్ డిగ్రీ చదువుతున్నాడు. కర్నూలు నగరంలోని ఎర్రబురుజుకు చెందిన మల్లెపోగు మురళీకృష్ణ(22) అతనికి స్నేహితుడు. ప్రేయసి నగ్న వీడియోలను దినేశ్ తన ఫోన్లో ఉంచుకున్నాడు. ఆ వీడియోలను మురళీకృష్ణ తన ఫోన్లోకి దినేశ్‌కు తెలియకుండా రహస్యంగా పంపించుకున్నాడు. అనంతరం ఆ యువతికి ఫోన్ చేసి అనేక విధాలుగా వేధించడం మొదలు పెట్టాడు. తాను అడిగింది చేయకపోతే ఈ వీడియోలను సామాజిక మాధ్యమాలలో పెడతానని, కుటుంబసభ్యులు, బంధువులకు పంపుతానని బెదిరించేవాడు.
దీంతో ఆ యువకుడి వేధింపులు తాళలేక యువతి ఇటీవల ఆత్మహత్యకు ప్రయత్నించిగా ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి దినేశ్.. మురళీకృష్టపై పగ పెంచుకుని చంపాలని నిర్ణయించుకున్నాడు. మురళీ కృష్ణను హత్య చేయాలనే విషయాన్ని దినేష్ మరో స్నేహితుడు కిరణ్‌కుమార్‌కు వివరించాడు. పథకం ప్రకారం శివమాల ధరించిన మురళీకృష్ణను జనవరి 25న దినేశ్, కిరణ్ కుమార్ ఇద్దరు కలిసి ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని నగర శివారులోని పంచలింగాల ప్రాంతానికి తీసుకెళ్లారు. మురళీకృష్ణను అక్కడ అతి కిరాతకంగా కత్తితో పొడిచి చంపారు.