కర్నూలు జిల్లా మద్దికేర మండలం ఆగ్రహారం గ్రామానికి చెందిన రైతులు ప్రభాకర్, హనుమప్ప, నాగరాజు తదితరులు మంగళవారం తాము పండించిన పంటను అమ్ముకునేందుకు కర్నూలు మార్కెట్ వెళ్లారు. అయితే తూకాల్లో మోసానికి పాల్పడుతున్నారని వారు చెబుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి ఇలాంటి మోసాలు ఇకనైనా జరగకుండా చూడాలని మొర పెట్టుకున్నారు.
కష్టించి పండించిన పంట.. దళారుల పాలు! - కర్నూలు మార్కెట్లో దళారుల మోసం వార్తలు
ఆరుగాలం కష్టించి పండించిన పంట ఉత్పత్తులను అమ్ముకునేందుకు కర్నూలు మార్కెట్ వెళ్తే అక్కడ దళారులు తూకాల్లో మోసం చేసి నిలువునా ముంచుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి మోసాలతోనే రైతలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కష్టించి పండించిన పంట.. దళారుల పాలు!