కర్నూలు జిల్లా గుత్తి ప్యాపిలి మండలం గుడిపాళ్ల గ్రామానికి చెందిన 24ఏళ్ల నగేశ్..గ్రామ వాలంటీర్ గా పని చేస్తున్నాడు. ఓ యువతిని నాలుగేళ్లుగా ప్రేమించానని…పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. తీరా ఆ యువతి పెళ్లి ప్రస్తావన తెచ్చేసరికి కుదరదు పొమ్మన్నాడు. మోసపోయానని గ్రహించిన ఆమె పోలీసులను ఆశ్రయించింది. విచారణ జరిపిన పోలీసులు నగేశ్‌పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి గుత్తి సబ్ జైలుకు తరలించినట్లు ఉరవకొండ ఎస్ఐ ధరణి బాబు తెలిపారు.
ప్రేమ పేరుతో గ్రామ వాలంటీర్ మోసం..ఫోక్సో చట్టం కింద కేసు నమోదు - Foxo Act Case registered on Village Volunteer who cheated in name of love
నాలుగేళ్లుగా ఓ యువతిని ప్రేమిస్తున్నానని నమ్మబలికాడు ఆ గ్రామ వాలంటీర్. తీరా పెళ్లి విషయం వచ్చేసరికి కాదు పొమ్మన్నాడు. ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతనిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన ఘటన కర్నూలు జిల్లా గుడిపాళ్లలో జరిగింది.
![ప్రేమ పేరుతో గ్రామ వాలంటీర్ మోసం..ఫోక్సో చట్టం కింద కేసు నమోదు Foxo Act Case registered on Village Volunteer who cheated in name of love](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8804661-646-8804661-1600170290650.jpg)
ప్రేమ పేరుతో గ్రామ వాలంటీర్ మోసం-ఫోక్సో చట్టం కింద కేసు నమోదు
TAGGED:
grama volunteer foxo act.