కర్నూలు జిల్లా ఆదోని మండలంలో నాలుగో విడత పంచాయతీ ఎన్నికలకు ప్రచార పర్వం జోరుగా కొనసాగుతోంది. పెసలబండ గ్రామంలో సర్పంచి అభ్యర్థి వెంకటరావు.. ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు. గ్రామాభివృద్ధే లక్ష్యంగా చేసుకొని ముందుకు వెళ్తున్న తనను గెలిపించాలని వెంకట్రావు.. గ్రామస్తులను కోరుతున్నారు.
తనను గెలిపిస్తే ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తానన్నది చెబుతూ.. రూ. 100 బాండ్ పేపర్‌పై రాసి ప్రజల వద్దకు వెళ్తున్నారు. "నేను బ్రహ్మచారిని.. గ్రామమే నా కుటుంబం. గెలిచిన 6 నెలలలోపే సమస్యలు పరిష్కరిస్తా" అంటూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.