నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్న నలుగురి అరెస్ట్ - forged cotton seeds sales at kurnool district
నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్న నలుగురు వ్యక్తులను కర్నూలు జిల్లా బైలుప్పులో పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.
నకిలీ పత్తి విత్తనాలు అముతున్న నలుగురి అరెస్ట్
కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలోని బైలుప్పులలో నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యవసాయాధికారి చేసిన సోదాల్లో 140 కిలోల పత్తి విత్తనాలు బయటపడ్డాయి. లక్ష్మీనారాయణ, వెంకటేశ్వర్లు, రాజు, హనుమంతు అనే వ్యక్తుల ఇంట్లో నుంచి ఈ నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి: ప్రేమించాడు... పెద్దల్ని ఒప్పించాడు.. కానీ అంతలోనే!
TAGGED:
kurnool district latest news