ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యూరియా కొరత లేదు...అయినా మార్కెట్లో అధిక ధర...! - kurnool

యూరియా కోసం కర్నూలు జిల్లా ఎమ్మిగన్నూరు రైతులు సంబంధిత కార్యాలయాల ముందు క్యూలు కడుతున్నారు. యూరియా కొరత లేదని అధికారులు చెబుతున్నా...అధిక ధరకు వ్యాపారులు అమ్ముతుండటం...కొరత ఉన్నట్టా...లేనట్టా అనే అనుమానం రైతుల్లో కలుగుతోంది.

యూరియా కొరత లేదు...అయినా మార్కెట్లో అధిక ధర...!

By

Published : Sep 3, 2019, 6:43 PM IST

యూరియా కొరత లేదు...అయినా మార్కెట్లో అధిక ధర...!

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో యూరియా కోసం రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గంటల తరబడి వరసలో నిల్చున్నారు. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు... పైర్లకు రైతులు యూరియా వేస్తున్నారు. ఈ కారణంగా ఒక్కసారిగా డిమాండ్ ఏర్పడింది. ఇదే అదనుగా కొందరు వ్యాపారులు దండిగా దోచుకుంటున్నారు. రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని బస్తాకు 50 నుంచి 100 రూపాయలు అధికంగా వసూలు చేస్తున్నారు. వ్యవసాయాధికారులు యూరియా కొరత లేదని చెబుతున్నా... వ్యాపారులు అధిక ధరలకు విక్రయించడం గమనార్హం.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details