ఎండిపోతున్న విత్తనాలు...ఆవేదనలో అన్నదాతలు - formers are waiting for rains due to seeds dry in kurnool distric
కురిసిన నాలుగు చినులకే సంతోషపడ్డ రైతులకు, మళ్లీ వరుణుడి దర్శనం కలుగలేదు. చుట్టపు చూపులా వచ్చిన వానదేవుడు, ఆ తర్వాత మొహం చాటేయడంతో జిల్లాలోని రైతన్నలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. రెండేళ్లుగా జిల్లావ్యాప్తంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు వెన్నాడుతున్నాయి. నాటిన విత్తనాలు నేలలో తేమ లేక ఎండిపోతున్నాయి.

ఎండిపోతున్న విత్తనాలు...ఆవేదనలో అన్నదాతలు
కర్నూలు జిల్లాలో వర్షాభావ పరిస్థితులు వరుసగా రెండో యేడాది వెన్నాడుతున్నాయి. ఖరీఫ్ ప్రారంభమై నెలన్నర కావస్తున్నా పదును వర్షం కురవక వాన కోసం రైతులు ఆకాశం వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు. జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం ఆరు లక్షల ముప్పై ఐదు లక్షల హెక్టార్లు కాగా ఇప్పటివరకు ఇరవై వేల హెక్టార్లలో విత్తనం వేశారు. విత్తనం వేసిన తర్వాత చినుకు జాడ లేక మొలిచిన మొక్కలు నేలలో తేమ లేక ఎండుతున్నాయి. భూములు దుక్కులు దున్ని వర్షం కోసం అన్నదాతలు ఆశగా చూస్తున్నారు.
ఎండిపోతున్న విత్తనాలు...ఆవేదనలో అన్నదాతలు