కర్నూలు జిల్లా పెద్దకడుబూరు గ్రామానికి చెందిన కపటి బోయ మారెన్న... పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మారెన్న 2 లక్షల అప్పు చేసి కౌలు పొలంలో పంటను సాగు చేశాడు. పంట బాగా పండితే అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యకు మంచి ఆస్పత్రిలో చికిత్స చేయించాలని అనుకున్నాడు. కాని పంటలు చేతికొచ్చే సమయానికి వర్షాలు ఎక్కువై చేతికొచ్చిన పంట కళ్లముందే నాశనమైంది.
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య - కర్నూలు జిల్లా నేర వార్తలు
అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్నూలు జిల్లా పెద్దకడుబూరులో జరిగింది.
ఆత్మహత్య చేసుకున్న మారెన్న
అప్పు ఇచ్చిన వారికి మోహం చాటేయలేక, భార్యకు చికిత్స చేయించుకోలేక మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనతో కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి.
ఇదీ చదవండి