YCP Government State Focus On The State development :రాష్ట్ర అభివృద్ధిపై వైసీపీ ప్రభుత్వం దృష్టి పెట్టలేదని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ కర్నూలులో అన్నారు. ప్రజలకు సంపదను పంచుకుంటూ పోతూ ఉంటే రాష్ట్రం ఎప్పుడు అభివృద్ధి చెందుతుందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులూ అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని టీజీ వెంకటేష్ తెలిపారు. ప్రజలకు శాశ్వతంగా అభివృద్ధి చెందే పనులు చేయాలే గాని ఉచితంగా పథకాలు అమలు చేస్తే వారికి ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఉచిత పథకాలను నిలిపివేసి అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఆయన కోరారు. రాష్ట్రంలో రాజధాని విషయం కొలిక్కి రాకపోవడంతో పెట్టుబడులు పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయని ఆయన తెలిపారు. రాయలసీమ పశ్చిమ జిల్లాల పట్టభద్రుల అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థి తప్పక విజయం సాధిస్తారని టీజీ వెంకటేష్ తెలిపారు.
రాష్ట్ర అభివృద్ధిపై వైసీపీ ప్రభుత్వం దృష్టి పెట్టలేదు: టీజీ వెంకటేష్
YCP Government State Focus On The State development :ప్రజలకు సంపదను పంచుకుంటూ పోతూఉంటే రాష్ట్రం ఎప్పుడు అభివృద్ధి చెందుతుందని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ కర్నూలులో ప్రశ్నించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఉచిత పథకాలను నిలిపివేసి అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఆయన కోరారు. రాయలసీమ పశ్చిమ జిల్లాల పట్టభద్రుల అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థి తప్పక విజయం సాధిస్తారని తెలిపారు.
ఉచిత పథకాలను నిలిపివేసి అభివృద్ధిపై దృష్టి పెట్టాలి
Last Updated : Dec 28, 2022, 3:33 PM IST
TAGGED:
ఉచితంగా పథకాలు అమలు చేస్తే