కృష్ణా జిల్లా నందిగామలో ఎటువంటి అనుమతులూ లేకుండా జాతీయ, రాష్ట్ర, మహానుభావుల విగ్రహాలను తొలగించి.. ప్రభుత్వ వైద్యశాల వెనక ఏర్పాటు చేసేందుకు అధికారులు నిర్మాణ పనులు చేపట్టడంపై మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతులు తీసుకోకుండానే ప్రభుత్వ వైద్యశాల ప్రహరీ గోడను కూల్చివేశారని.. అందులో ఉన్న దశాబ్దాల నాటి చెట్లను సైతం నరికి వేశారని మండిపడ్డారు. అనుమతులు ఉన్నాయా అని నందిగామ మున్సిపల్ కమిషనర్ జయరాములను తంగిరాలసౌమ్య నిలదీశారు. కమిషనర్ నుంచి సరైన సమాధానం రాకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
నందిగామ నగర పంచాయతీ కార్యాలయం ఎదురుగా చందర్లపాడు రోడ్డులోని రక్షిత మంచి నీటి పైప్ లైన్ లీకేజీలను మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పరిశీలించారు. నందిగామలో వైకాపా ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి ఇదేనా? అని ప్రశ్నించారు.