ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హరినగరంలో వన్య ప్రాణుల మాంసం విక్రయం.. నాటు తుపాకీ స్వాధీనం

కర్నూలు జిల్లా హరినగరం గ్రామంలో ఈశ్వరయ్య అనే వ్యక్తి ఇంట్లో నాటు తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వన్యప్రాణుల మాంసం విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో తమ సిబ్బందితో కలిసి సోదాలు నిర్వహించామని ఫారెస్టు రేంజర్ శ్రీపతినాయుడు తెలిపారు.

హరినగరంలో నాటు తుపాకీ స్వాధీనం
హరినగరంలో నాటు తుపాకీ స్వాధీనం

By

Published : Jun 29, 2021, 10:20 AM IST

కర్నూలు జిల్లా రుద్రవరం మండలం హరినగరం గ్రామంలోని ఈశ్వరయ్య అనే వ్యక్తి ఇంట్లో నాటు తుపాకీ స్వాధీనం చేసకున్నట్లు ఫారెస్ట్ రేంజర్ శ్రీ పతినాయుడు తెలిపారు. ఆయన మాట్లాడుతూ..హరినగరంలో వన్యప్రాణుల మాంసం విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో రేంజర్ తన సిబ్బందితో కలిసి సోదాలు నిర్వహించారు. సోదాల్లో ఈశ్వరయ్య ఇంట్లో నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.

వన్య ప్రాణులను చంపేందుకు ఈ నాటు తుపాకీ ఈశ్వరయ్య ఉపయోగిస్తున్నట్లు తమకు తెలిసిందన్నారు. నిందితుడు తమకు పట్టుబడకుండా పారిపోయాడని, అతడి కోసం గాలిస్తున్నామని తెలిపారు. ఎవరైనా వన్యప్రాణులను వేటాడితే కేసులు నమోదు చేస్తామన్నారు. నాటు తుపాకీని రుద్రవరం ఎస్సై రామ్మోహన్ రెడ్డికి అందజేసినట్లు రేంజర్ తెలిపారు.

ఇదీ చదవండి:

CM JAGAN: 24 గంటలూ.. పిల్లలకు వైద్య సేవలు

ABOUT THE AUTHOR

...view details