శ్రీశైలం జలాశయానికి వరద నీటి ప్రవాహం పెరిగింది. ఎగువ నుంచి 1,06,476 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి చేరింది. శ్రీశైలం జలాశయం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 882.50 అడుగులతో నిండుకుండను తలపిస్తోంది. జలాశయం గరిష్ఠ నీటినిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు. ప్రస్తుతం 201.5822 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. విద్యుదుత్పత్తి చేస్తూ 50,260 క్యూసెక్కులు సాగర్‌కు విడుదల చేస్తున్నారు.
Srisailam Project: నిండుకుండలా శ్రీశైలం జలాశయం - శ్రీశైలం జలాశయానికి వరద
శ్రీశైలం జలాశయానికి వరద నీటి ప్రవాహం పెరిగింది. ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 1,06,476 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది.
నిండుకుండలా శ్రీశైలం జలాశయం...