ఎగువన కురుస్తున్న వర్షాలకు.. కృష్ణమ్మ బిర బిరా ప్రవహిస్తోంది. ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద కొనసాగుతోంది. జూరాల, సుంకేసుల, హంద్రీ నుంచి 84,821 క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి వస్తోంది. ఇప్పటికే 72,098 క్యూసెక్కుల వరద నీరు జలాశయానికి వచ్చి చేరింది.
శ్రీశైలంలో జలకళ... ఎగువ నుంచి భారీగా వరద
ఎగువన కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు చేరుతోంది. జూరాల, సుంకేసుల, హంద్రీ నుంచి 84,821 క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి వస్తోంది. వరదతో జలాశయ నీటి మట్టం 851.90 అడుగులకు చేరింది.
శ్రీశైలంలో జలకళ... ఎగువ నుంచి భారీగా వరద
ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 851.90 అడుగులకు చేరుకుంది. జలాశయ నీటినిల్వ సామర్థ్యం 84.2894 టీఎంసీలు. ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో... విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 40,253 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు.
ఇదీ చదవండి :కరోనా యోధురాలు... 86 ఏళ్ల వయసులో వైరస్‌పై విజయం