ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి క్రమంగా వరద ఉద్ధృతి పెరుగుతోంది. ప్రస్తుతం 23,464 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోందని డ్యామ్ అధికారులు వెల్లడించారు. జూరాల నుంచి శ్రీశైలంలోకి 6,300 క్యూసెక్కుల నీరు వస్తోంది. సుంకేశుల జలాశయం నుంచి శ్రీశైలానికి 8,554 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. హంద్రీ నది నుంచి శ్రీశైలం జలాశయంలోకి 8,760 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 821.10 అడుగులుగా ఉంది.
SRISAILAM RESERVOIR : ఎగువ నుంచి.. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం - శ్రీశైలం జలాశయం నీటి మట్టం
శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి 23,464 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 821.10 అడుగులుగా ఉంది.
SRISAILAM RESERVOIR
Last Updated : Jun 15, 2022, 7:42 PM IST