ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఓర్వకల్లు విమానాశ్రయం నుంచి సేవలు ప్రారంభం - కర్నూలు ఓర్వకల్లు విమానాశ్రయంలో సేవలు ప్రారంభం

కర్నూలు విమానాశ్రయం ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. ఓర్వకల్లులో ఉన్న ఎయిర్ పోర్టుకు.. బెంగళూరు విమానం చేరుకుంది.

kurnool, airport
కర్నూలు, ఓర్వకల్లు విమానాశ్రయం

By

Published : Mar 28, 2021, 10:46 AM IST

కర్నూలులోని ఓర్వకల్లు విమానాశ్రయంలో.. ప్రయాణికులకు సేవలు ప్రారంభమయ్యాయి. ఇవాళ ఉదయం 10.10గంటలకు మొదటి విమానం బెంగళూరు నుంచి కర్నూలు చేరుకుంది. ఉదయం 10.30 గంటలకు కర్నూలు నుంచి విమానం విశాఖకు బయల్దేరింది.

కర్నూలు నుంచి విశాఖ, చెన్నై, బెంగళూరుకు విమానాల సేవలు నడవనున్నాయి. ఇటీవలే ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ విమానాశ్రయంలో.. ఇప్పుడు విమానాల రాకపోకలతో సందడి నెలకొంది.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details