ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్నూలు నుంచి త్వరలో విమాన సేవలు ప్రారంభం - flight for kurnool to hyderabab

కర్నూలు విమానాశ్రయం నుంచి మార్చి 28న విమానసేవలు ప్రారంభించనున్నట్లు ఇండిగో సంస్థ వెల్లడించింది. కర్నూలు నుంచి బెంగళూరు, విశాఖపట్నం, చెన్నై నగరాలకు విమాన సేవలు ప్రారంభించనున్నట్లు స్పష్టం చేసింది.

flight services from karnool starts from march 28
flight services from karnool starts from march 28

By

Published : Jan 29, 2021, 3:20 PM IST

కర్నూలు విమానాశ్రయం నుంచి మూడు నగరాలకు విమాన సేవలు ప్రారంభించనున్నట్లు ఇండిగో సంస్థ తెలిపింది. మార్చి 28 నుంచి ఈ స్వరీసులు ప్రారంభం కానున్నట్లు స్పష్టం చేసింది. ఉడాన్ పథకం కింద కర్నూలు నుంచి బెంగళూరు, విశాఖపట్నం, చెన్నై నగరాలకు విమాన సర్వీసులు నడపనున్నట్లు వెల్లడించింది. బెంగళూరు- కర్నూలు, విశాఖపట్నం-కర్నూలు, చెన్నై- కర్నూలు.. ఈ మూడు మార్గాల్లో వారానికి నాలుగుసార్లు విమాన సేవలు ఉంటాయి.

"ఈ నిర్ణయంతో భారతదేశంలో ప్రాంతీయ కనెక్టివిటీని వ్యూహాత్మకంగా మెరుగుపరుస్తుంది. ఆంధ్రప్రదేశ్​లోని మూడు రాజధానులలో కర్నూలు ఒకటి. అలాగే రాబోయే హైదరాబాద్-బెంగళూరు ప్రారిశ్రామిక నడవలో కీలకమైన ప్రాంతం. ఈ విమాన సేవల ద్వారా ప్రభుత్వం అధికారులకు, పర్యాటకులకు మేలు జరుగుతుంది."- ఇండిగో చీఫ్ స్ట్రాటజీ అండ్ రెవెన్యూ అధికారి సంజయ్ కుమార్

ఇదీ చదవండి: ప్రభుత్వ సలహాదారు పదవి నుంచి సజ్జలను తప్పించాలని గవర్నర్​కు ఎస్‌ఈసీ లేఖ

ABOUT THE AUTHOR

...view details