కర్నూలు జిల్లా కోడుమూరు మండలం ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ జెండాను ఎగరవేశారు.
గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అని తెలిపిన మహాత్ముని కల... గ్రామ సచివాలయాలతో నెరవేరిందని చెప్పారు. ఈ విషయాన్ని చెప్పేందుకు తాను గర్వపడుతున్నట్లు పేర్కొన్నారు.