కర్నూలు జిల్లా ఆదోనిలో దారుణం జరిగింది. ఐదేళ్ల బాలికపై ఓ ఆటోడ్రైవర్ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. సాయంత్రం శివారు కొండ దగ్గర సికిందర్ అనే ఆటో డ్రైవర్.. చిన్నారిపై అఘాయిత్యానికి ఒడిగట్టేందుకు యత్నించాడు. అటుగా వెళ్తున్న శివస్వాములు చిన్నారి అరుపులు గమనించి నిందితుడి నుంచి ఆమెను కాపాడారు. అనంతరం మృగాడిని పోలీసులకు అప్పగించారు. విషయం తెలుసుకున్న చిన్నారి తల్లిదండ్రులు, కాలనీ వాసులు పోలీసు స్టేషన్ ఎదుట నిరసనకు దిగారు. కామాంధుడిపై దిశ చట్టం కింద కేసు నమోదు చేయాలని ఆందోళన చేపట్టారు. స్పందించిన పోలీసులు తగిన న్యాయం చేస్తామని హామీ ఇవ్వటంతో ఆందోళన విరమించారు.
ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం...నిందితుడి అరెస్టు ! - చిన్నారిపై అత్యాచారయత్నం
ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడకుండా నిర్భయ, దిశలాంటి పటిష్ఠ చట్టాలు వస్తున్నా...కామాంధుల కళ్లకు ఆ చట్టాలేవి కనపడటం లేదు. చిన్నారులని చూడకుండా కామంతో వారిని చిధిమేస్తున్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలో 5 ఏళ్ల బాలికపై ఓ మృగాడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. అటుగా వెళ్తున్న శివస్వాములు బాలికను రక్షించి నిందితుణ్ణి పోలీసులకు అప్పగించారు.
ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం