కర్నూలు జిల్లా నంద్యాల పురపాలక సంఘం నిర్వహణలోని డంపింగ్ యార్డులో మంటలు చెలరేగాయి. తద్వారా వెలువడిన పొగ పట్టణంలోని హరిజనవాడ, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణాలను కమ్ముకుంది. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందారు. వారం రోజులుగా డంపింగ్ యార్డులో మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. అగ్నిమాపక సిబ్బంది ఇప్పటికీ రెండుసార్లు మంటలను అదుపు చేశారు. అగ్నిప్రమాదం వల్ల డంపింగ్ యార్డు తగలబడిందా.. లేక మరేదైనా కారణమా అనే విషయం తెలియాల్సి ఉంది.
నంద్యాల డంపింగ్ యార్డులో మంటలు..స్థానికుల ఆందోళన - fire at dumping yard of Nandyal
నంద్యాల పురపాలక సంఘం నిర్వహణలోని డంపింగ్ యార్డులో మంటలు చెలరేగడంతో.. పట్టణంలోని హరిజనవాడ, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణాలను పొగ కమ్మేసింది.
Fires broke out at a dumping yard at Nandyal