ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అగ్నిమాపక అధికారుల ఘర్షణ.. ఒకరు సస్పెన్షన్​

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఇద్దరు అగ్నిమాపక అధికారుల మధ్య కోట్లాట జరిగింది. ఈ ఘటనలో ఒకరిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

fire officers fight in emmiganuru kurnool district
అగ్నిమాపక అధికారుల ఘర్షణ.. ఒకరు సస్పెండ్

By

Published : Nov 13, 2020, 4:24 PM IST

Updated : Nov 13, 2020, 5:31 PM IST

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో అగ్నిమాపక రీజినల్ అధికారి, అగ్నిమాపక అధికారి పరస్పరం కొట్టుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అగ్నిమాపక అధికారిపై కేసు నమోదవటంతో అతన్ని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.

తుంగభద్ర పుష్కరాల సందర్భంగా గురువారం రీజినల్ అగ్నిమాపక అధికారి స్వామి, కోడుమూరు అగ్నిమాపక కేంద్రం అధికారి వెంకటరమణతో పాటు ఇతర అధికారులు పుష్కర ఘాట్​లు పరిశీలించి ఎమ్మిగనూరు చేరుకున్నారు. పుష్కర ఘాట్ వద్ద కోడుమూరు అగ్నిమాపక అధికారిపై రీజినల్ అధికారి కోప్పడి దూషించినట్లు సమాచారం. వాదన ముదిరి ఘర్షణ పడి పరస్పరం కొట్టుకున్నారు. కోడుమూరు అగ్నిమాపక అధికారిపై రీజినల్ అగ్నిమాపక అధికారి ఫిర్యాదు చేయటంతో అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉన్నతాధికారులు కోడుమూరు అగ్నిమాపక అధికారిని సస్పెండ్ చేశారు.

Last Updated : Nov 13, 2020, 5:31 PM IST

ABOUT THE AUTHOR

...view details