కారులో మంటలు.. ముందు భాగం దగ్ధం - ap accidents
వేగంగా ప్రయాణిస్తున్న కారులో నుంచి హఠాత్తుగా మంటలు చెలరేగిన కారణంగా.. అందులోని ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. కర్నూలు జిల్లా డోన్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. అగ్ని మాపక సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చారు.
కారులో నుంచి వచ్చే పొగలు
కర్నూలు జిల్లా డోన్ జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న కారులో హఠాత్తుగామంటలు చెలరేగాయి. పొగలతో కూడిన మంటలు ఎగసిపడ్డాయి. బాధితుల నుంచి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలు అదుపులోకి తెచ్చారు. వాహనం ముందు భాగం పూర్తిగా కాలిపోయింది. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు.