ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం - Fire at Srisailam power station

శ్రీశైలం జలాశయం కుడిగట్టు విద్యుత్ కేంద్రంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మొదటి జనరేటర్​లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీనితో 110 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది

శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం

By

Published : Sep 19, 2019, 3:51 PM IST

శ్రీశైలం జలాశయం కుడిగట్టు విద్యుత్ కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగింది. మొత్తం 7 జనరేటర్ల ద్వారా 770 మెగావాట్ల విద్యుత్​ను ఉత్పత్తి చేస్తుంటారు. ఇందులో మొదటి జనరేటర్​లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే సిబ్బంది మంటలు ఆర్పారు. ఈ ప్రమాదంతో 110 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. జనరేటర్ బ్రేక్ ప్యాడ్స్ మధ్య మంటలు చెలరేగినట్లు గుర్తించారు. నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు

శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం

ABOUT THE AUTHOR

...view details