ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అగ్ని ప్రమాదం.. ప్రైవేట్​ పాఠశాల బస్సు దగ్ధం - school bus accident at kurnool

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఓ ప్రైవేట్ పాఠశాల బస్సులో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో రూ.4 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.

fire accident in school bus at emmiganuru
అగ్ని ప్రమాదంలో ప్రైవేట్​ పాఠశాల బస్సు దగ్ధం..

By

Published : Jun 14, 2021, 11:13 AM IST

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు అగ్ని ప్రమాదంలో కాలిపోయింది. పాఠశాల ఆవరణలో నిలిపి ఉంచగా బస్సులో మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను ఆర్పారు.

మంటలు వ్యాపించకుండా.. చర్యలు చేపట్టినందన ప్రక్కన ఉన్న మరో బస్సుకు ఎలాంటి నష్టం జరగలేదు. ప్రమాదంలో నాలుగు లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని అగ్నిమాపక అధికారి తెలియజేశారు.

ABOUT THE AUTHOR

...view details