ఆదోని కూరగాయల మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం - ఆదోని కూరగాయల మార్కెట్లో అగ్ని ప్రమాదం
![ఆదోని కూరగాయల మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం ఆదోని కూరగాయల మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6757502-552-6757502-1586633186411.jpg)
00:44 April 12
అగ్ని ప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోనిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పట్టణంలోని ఝాన్సీ లక్ష్మీభాయ్ కూరగాయల మార్కెట్లో భారీ మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థిలికి చేరుకుని మంటలు అదుపులో తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కూరగాయల మార్కెట్లో ఉన్న వందల దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా ఇటీవలె కూరగాయలు మార్కెట్‌ను వికేంద్రీకరణ చేశారు. మంటలు వ్యాపించకుండా ఆ ప్రాంతంలో కరెంట్ కోత విధించారు.
ఇదీ చదవండి : వైకాపా ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు