కర్నూలు జిల్లా ఆదోనిలోని ఓ ఏటీఎంలో మంటలు అంటుకున్నాయి. పట్టణంలోని చందా సరోజ దర్గా ఎదురుగా ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో విద్యుదాఘాతంతో అగ్ని ప్రమాదం జరిగింది. రాత్రి సమయంలో సర్వీస్ వైర్ ద్వారా మంటలు వ్యాపించి పవర్ సప్లై బోర్డులకు మంటలు అంటుకున్నట్టు గుర్తించారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది సకాలంలో మంటలు ఆర్పగా ప్రమాదం తప్పింది. ఏటీఎంలో ఉన్న నగదుకు మంటలు వ్యాపించలేదని పోలీసులు తెలిపారు.
ఏటీఎంలో మంటలు... క్షేమంగా నగదు - adhoni latest crime news
కర్నూలు జిల్లా ఆదోనిలోని ఎస్బీఐ ఏటీఎంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏటీఎంలో ఉన్న నగదకు మంటలు వ్యాపించలేదని పోలీసులు తెలిపారు.
ఏటీలో మంటలు... తప్పిన ప్రమాదం