కర్నూలు జిల్లాలోని పలు ఆస్పత్రులను కలెక్టర్ వీర పాండియన్ సందర్శించారు. అనుమతి లేకున్నా కరోనా రోగులకు వైద్యం అందిస్తున్నట్లు గుర్తించిన కలెక్టర్... ఆస్పత్రులకు రూ.40 లక్షలు జరిమానా విధించారు. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజుల కన్నా అధిక బిల్లులు వసూలు చేయడం, రెమిడెసివర్ ఇంజక్షన్ దుర్వినియోగంపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆస్పత్రుల యాజమాన్యాలకు నోటీసులు జారీ చేసి, వారంలోపు జరిమానా మొత్తాన్ని చెల్లించాలని ఆదేశించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
కర్నూలులో నిబంధనలు పాటించని ఆస్పత్రులకు రూ.40 లక్షల జరిమానా - kurnool crime
కర్నూలు జిల్లాలో ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించిన ఆస్పత్రులకు కలెక్టర్ వీర పాండియన్ జరిమానా విధించారు. ఈ మొత్తాన్ని వారంలోపు చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు.
కర్నూలులో నిబంధనలు పాటించని ఆస్పత్రులకు జరిమానా