కర్నూలు జిల్లా నంద్యాలలో కరోనాతో మృతి చెందిన రెవెన్యూ ఉద్యోగుల కుటుంబాలకు.. రాష్ట్ర రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ ఆర్థిక సాయం ప్రకటించింది. నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి.. బాధిత కుటుంబాలకు చెక్కులు అందజేశారు.
- నంద్యాల ఎస్సార్బీసీలో డిప్యూటీ తహసీల్దార్ మహబూబ్ బాషా కరోనాతో మృతి చెందారు. ఆయన కుటుంబ సభ్యులకు.. జిల్లా రెవెన్యూ ఉద్యోగులు రూ.4 లక్షలు, నంద్యాల రెవెన్యూ ఉద్యోగుల సంఘం రూ.2 లక్షలు విరాళంగా ఇచ్చారు.
- రుద్రవరం మండలం ఎంఎల్సీ పాయింట్ అర్ఐ గురుస్వామి కరోనాతో మృతి చెందగా.. ఆయన కుటుంబ సభ్యులకు రూ.70,000 ఆర్థిక సాయాన్ని అందజేశారు.