కర్నూల్ జిల్లా డోన్‌లో పలు అభివృద్ధి పనులను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి ప్రారంభించారు. డోన్ మండలంలోని ఎర్రగుంట్ల సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న నగర వనాన్ని పరిశీలించారు. పార్క్‌కు వచ్చే సందర్శకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు. అటవీప్రాంతం అయినందున వన్య ప్రాణులు, మృగాలు పార్కులో చొరబడకుండా కంచె నిర్మాణం చేపట్టాలని తెలిపారు. ఆహ్లాదకర ప్రదేశంగా ఉన్నందున సెలవు దినాల్లో పాఠశాలల యాజమాన్యాలను ఒప్పించి విహార యాత్రకు పిల్లలకు అవకాశం కల్పించేలా చూడాలన్నారు.
డోన్‌లో మంత్రి బుగ్గన పర్యటన.. - Minister Bugna visit to done
ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కర్నూల్ జిల్లా డోన్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలాగే మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు.
ఆర్థిక మంత్రి బుగ్గన
కన్నప్ప కుంట గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. చిన్న మల్కాపురం గ్రామం నుంచి కమలాపురం వెళ్లే రహదారిని మంత్రి ప్రారంభించారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి ప్రజా సమస్యలపై చర్చించిన మంత్రి.. పరిష్కారం చూపాలని ఆదేశించారు.
ఇదీ చదవండీ..మార్కెట్ యార్డుల ఆధునీకరణ కోసం రూ.212 కోట్లు