ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రంలో బీసీలపై దాడులు జరగడం లేదు..: బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి - Buggana Rajendranath Reddy on TDP

Finance Minister Buggana Rajendranath Reddy: ఎమ్మెల్సీల ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్​సీపీ కర్నూలు జిల్లా నేతలతో రాష్ట్ర బుగ్గన రాజేంద్రనాథ్​రెడ్డి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమావేశమయ్యారు. ప్రతిపక్షం వల్లే రోజు ఎక్కడో ఒకచోట గొడవలు చోటు చేసుకుంటున్నాయని బుగ్గన రాజేంద్రనాథ్​రెడ్డి వెల్లడించారు. ఆ గొడవలను రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నట్లు చూపించడం సరికాదని బుగ్గన సూచించారు.

Buggana Rajendranath Reddy
బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి

By

Published : Feb 25, 2023, 5:32 PM IST

ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి

Buggana Rajendranath Reddy on TDP: రాష్ట్రంలో శాంతి భద్రతలు సంతృప్తి కరంగా ఉన్నాయని.. రాష్ట్రంలో ఎక్కడ అరాచకాలు, దాడులు కొనసాగడం లేదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కర్నూలులో అన్నారు. కర్నూలు లోని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఇంట్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు ఎన్నికల సందర్భంగా జరిగిన సమావేశంలో ఈ వాఖ్యలు చేశారు. కర్నూలు, నంద్యాల జిల్లాల ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్య వైసీపీ నాయకులతో రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో గెలుపు కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని.. వారు ప్రజాప్రతినిధులను కోరారు. ఈ సందర్భంగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని తెలిపారు.

ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకులు అనవసర విషయాలపై రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షం వల్లే రోజు ఎక్కడో ఒకచోట గొడవలు చోటు చేసుకుంటున్నాయని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. ఆ గొడవలను రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నట్లు చూపించడం సరికాదని బుగ్గన సూచించారు. రాష్ట్రంలో 2014- 19 కన్నా 2019 సంవత్సరం తర్వాత క్రైమ్ రేటు చాలా తగ్గిందని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు సేవలు ఉత్తమంగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించిందన్నారు. ప్రతిపక్షపార్టీ నాయకులు సభ్యత్వ సంస్కారంగా వ్యవహరించడం లేదని బుగ్గన విమర్శించారు.

'2014 నుంచి 2019తో పోల్చితే కేసుల సంఖ్య తగ్గింది. 2019 తరువాతి నుంచి కేంద్ర ప్రభుత్వం చేసిన సర్వేలో సైతం పోలీసులు పని తీరుపై మంచిగానే స్పందించింది. రాష్ట్రంలో ఎలాంటి దాడులు జరగడంలేదు. ఏదో ఒక చోట దాడులు జరిగితే మెుత్తం దాడులు జరిగినట్లు చూపిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ వాళ్లు.. అధికార పక్షం వాళ్లు ఎక్కువ మంది ఉన్న ప్రదేశానికి వెళ్లి మాట్లాడుతున్నారు. బీసీలకు జగన్ ప్రభుత్వం ఎలాంటి ప్రధాన్యం ఇస్తున్నామో జనమే చూస్తున్నారు. తమ ప్రభుత్వం బీసీ, ఎసీ, ఎస్టీలకు ఎలాంటి ప్రధాన్యం ఇస్తోందో అర్థమవుతోంది.'- బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి

ఇవీ చదంవడి:

ABOUT THE AUTHOR

...view details