ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్నూలులో రహదారుల నిర్మాణానికి ఆర్థిక మంత్రి బుగ్గన భూమి పూజ - వాలంటరీలు, కార్యదర్శులతో బుగ్గన సమీక్ష

కర్నూలు జిల్లాలో పలు రహదారుల నిర్మాణానికి ఆర్థిక మంత్రి బుగ్గన భూమి పూజ చేశారు. అనంతరం వాలంటరీలు, కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పథకాలన్నింటినీ అర్హులైన వారందరికీ చేరేలా కృషి చేయాలని తెలిపారు.

finance minister buggana bhumi puja
రోడ్డు మార్గల నిర్మాణానికి ఆర్థిక మంత్రి బుగ్గన భూమి పూజ

By

Published : Dec 25, 2020, 5:56 PM IST

కర్నూలు జిల్లాలోని డోన్ నుంచి రాయలచెరువుకి 30 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న రోడ్డుకి, 4.5 కోట్లతో డోన్ నుంచి క్రిష్ణగిరికి వెళ్లే రహదారికి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి భూమి పూజ చేశారు. అనంతరం డోన్ పట్టణంలోని సాయి ఫంక్షన్ హాల్​లో గ్రామ, పట్టణ వాలంటరీలు, కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉండే వాలంటరీలు, సచివాలయ సిబ్బంది అంకితభావంతో పని చేయాలని ఆర్థిక మంత్రి బుగ్గన పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలన్నింటినీ అర్హులైన వారందరికీ చేరేలా కృషి చేయాలని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details