కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం హుసేనాపురం గ్రామంలో వెటర్నరీ, పాలిటెక్నిక్ కళాశాల నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పరిశీలించారు. అనంతరం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
సంక్షేమ పథకాలను ప్రజలకు చేరేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని దిశా నిర్దేశం చేశారు. డోన్ నియోజకవర్గంలో ఇళ్ల స్థలాల గురించి అధికారులతో మాట్లాడారు.