కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామిని దర్శించుకునేందుకు... భక్తులు భారీగా తరలివచ్చారు. దేశ నలుమూలల నుంచి వచ్చినవారంతా.. దర్శనానికి పోటెత్తారు. గ్రామదేవత మంచాలమ్మ, రాఘవేంద్రస్వామి మూలబృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా శ్రీ మఠం అధికారులు దర్శనానికి ఏర్పాట్లు చేశారు. ఇవాళ స్వామివారి దర్శనానికి 70 వేలమంది తరలివచ్చారని అధికారులు తెలిపారు.
మంత్రాలయం శ్రీరాఘవేంద్రస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు - KURNOOL
కర్నూలు జిల్లాలోని మంత్రాలయం శ్రీరాఘవేంద్రస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచి ఉదయం 10 గంటల వరకే 70 వేలకు పైగా భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.
మంత్రాలయం శ్రీరాఘవేంద్రస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు