కిసాన్ రైలులో రవాణా ఛార్జీలు తగ్గించాలన్న రైతుల విజ్ఞప్తి మేరకు 50 శాతం రాయితీ ఇస్తున్నట్లు కర్నూలు జిల్లా నంద్యాల రైల్వే స్టేషన్ అధికారులు తెలిపారు. ఛార్జీలకు సంబంధించిన పూర్తి వివరాలను రైల్వేస్టేషన్ మేనేజర్, చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ వివరించారు. నంద్యాల డివిజన్ పరిధిలోని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నంద్యాల రైల్వే స్టేషన్ నుంచి గుంటూరు, విశాఖపట్నం, చెన్నై, బెంగళూరు, భువనేశ్వర్, బ్రహ్మపుర్, నాందేడ్, ముంబై, దిల్లీ, జైపూర్, చండీగడ్ తదితర ప్రాంతాలకు కిసాన్ రైలు వెసులుబాటు ఉందని అధికారులు తెలిపారు.
కిసాన్ రైలులో ఛార్జీలపై యాభై శాతం సబ్సిడీ - nandhyala latest news
కిసాన్ రైలులో రవాణా చేసే వ్యవసాయ ఉత్పత్తుల ఛార్జీలపై నంద్యాల రైల్వే స్టేషన్ అధికారులు రాయితీ కల్పించారు. ఛార్జీల్లో 50 శాతం సబ్సిడీ ఇస్తున్నట్లు తెలిపారు.
కిసాన్ రైలులో ఛార్జీలపై యాభై శాతం సబ్సిడీ