కర్నూలు జిల్లాలో దేవరగట్టు మాల మల్లేశ్వర స్వామి ఉత్సవాల్లో భాగంగా గొలుసు తెంచే కార్యక్రమం వైభవంగా జరిగింది. అలహరి మండలం వల్లూరుకు చెందిన గురవయ్య గడిలింగప్ప స్వామివారి గొలుసును 23 సార్లు తెంచారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన గురువులు నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు కర్ణాటక, ఆంధ్ర భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎలాంటి దుష్పరిణామాలు చోటుచేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.
గడిలింగప్ప.... 23 సార్లు స్వామి గొలుసు తెంచాడప్ప....
కర్నూలు జిల్లాలో దేవరగట్టు మాల మల్లేశ్వర స్వామి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈరోజు గొలుసు తెంపే కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది.
మాల మల్లేశ్వర స్వామి ఉత్సవాలు