కర్నూలు జిల్లా సి.బెలగళ్ మండలం చింతమానుపల్లెలో దారుణం జరిగింది. కన్న తండ్రే కాలయముడయ్యాడు. ఓ తండ్రి తన 18 నెలల కుమారుడి గొంతు కోసి చంపాడు. నాగేశ్వర రెడ్డి, సరితలకు ఇద్దరు కుమారులు. చిన్న కొడుకు సందీప్‌కు 18 నెలలు. రాత్రి బాగా పొద్దుపోయాక తండ్రి కత్తితో బాలుడి గొంతు కోసి హత్య చేశాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కారణాలు తెలియాల్సి ఉంది. అతనికి మతిస్థిమితం లేదని..అందుకే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని బంధువులు తెలిపారు.
దారుణం: 18 నెలల కుమారుడి గొంతు కోసి చంపిన తండ్రి - చింతమానుపల్లెలో చిన్నారి హత్య వార్తలు
కర్నూలు జిల్లా సి.బెలగళ్ మండలం చింతమానుపల్లెలో దారుణం జరిగింది. మతిస్థిమితం లేని ఓ తండ్రి తన18 నెలల కుమారుడి గొంతు కోసి చంపాడు.
![దారుణం: 18 నెలల కుమారుడి గొంతు కోసి చంపిన తండ్రి father murdered his two year old daughter in chinthamanupalle](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7596166-495-7596166-1592021947634.jpg)
రెండేళ్ల కూతురి గొంతుకోసి చంపిన తండ్రి
Last Updated : Jun 13, 2020, 5:19 PM IST