ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Mureder: మద్యం మత్తులో కుమారుడిని చంపిన తండ్రి - పెద్దకొట్టాల హత్య కేసు

వ్యసనాలకు దూరంగా ఉండాలని బిడ్డకు చెప్పాల్సిన తండ్రే.. తాగి వచ్చి కుమారుడితో తగువు పెట్టుకున్నాడు. విచక్షణ మరిచి రోకలిబండతో బాదాడు. తీవ్రగాయపాలైన ఆ యువకుడు.. మృతి చెందాడు.

father kills his son
కుమారుడిని చంపిన తండ్రి

By

Published : Aug 23, 2021, 11:23 AM IST

మమకారం పంచిన ఆ చేతులే మద్యం మత్తులో విచక్షణ మరిచి కన్నబిడ్డను కడతేర్చాయి. కర్నూలు జిల్లా నంద్యాల మండలం పెద్దకొట్టాల గ్రామంలో ఈ ఘటన జరిగింది. స్థానికంగా ఉండే గురప్ప అనే వ్యక్తి మద్యం సేవించి తన కుమారుడు శివకృష్ణ (28)తో మత్తులో గొడవ పడ్డాడు.

మాటామాటా పెరిగి కోపోద్రికుడైన గురప్ప.. శివకృష్ణను రోకలి బండతో బాదాడు. తీవ్రగాయపాలైన అతడిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు శివకృష్ణ భార్య ఫిర్యాదు మేరకు నంద్యాల గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details