కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని మసీదుపురంలో నారాయణ(32) అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. మూడు నెలల క్రితం కుమార్తె(12) తాగునీటి కోసం వెళ్లి నీటి తొట్టెలో పడి మృతి చెందింది. అప్పటినుంచి మనోవేదనకు గురైన నారాయణ గురువారం బహిర్భూమికి వెళ్లి మద్యంలో పురుగుల మందు కలుపుకుని తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవపరీక్ష కోసం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కుమార్తె మృతి తట్టుకోలేక... తనువు చాలించిన తండ్రి - father could not bear death of his daughter..committed suicide
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని మసీదుపురంలో ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని కుమార్తె మూడు నెలల క్రితం ప్రమాదవశాత్తు మరణించింది. ఆమె మృతిని తట్టుకోలేక బలవన్మరణం చెందాడు.
![కుమార్తె మృతి తట్టుకోలేక... తనువు చాలించిన తండ్రి father could not bear death of his daughter..committed suicide](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8929500-656-8929500-1601012097490.jpg)
కుమార్తె మృతి తట్టుకోలేక... తనువు చాలించిన తండ్రి
TAGGED:
Vyakthi athmahathya