కర్నూలు జిల్లాలోని బనగానపల్లెలో దారుణం జరిగింది. కూతురిని కన్న తండ్రే అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తల్లి, తమ్ముడిని చంపుతానని.. తాను చెప్పినట్లు వినాలని బెదిరించి.. తండ్రి గత కొద్ది రోజులుగా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మూడు రోజులుగా కడుపునొప్పితో బాధ పడుతోన్న యువతిని.. తల్లి స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లింది. వైద్యశాలలో సైతం కూతురు పక్కనే కూర్చుని వెకిలి చేష్టలు చేశాడు. భయపడిన బాధితురాలు జరిగిన విషయాన్ని కన్న తల్లికి చెప్పింది. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తల్లి ఫిర్యాదుతో బాధితురాలి నుంచి వివరాలు సేకరించిన పోలీసులు.. నిందితుణ్ని అరెస్టు చేసి పాణ్యం పోలీస్ స్టేషన్కు తరలించారు.
విచక్షణ మరిచిన తండ్రి... కన్నకూతురిపై అత్యాచారం - father rapes daughter at karnool
నాన్నంటే ఓ ధైర్యం.. పిల్లలను కంటికి రెప్పలా కాపడతాడనే నమ్మకం. ఆ నమ్మకాన్ని వమ్ము చేశాడు ఓ కీచక తండ్రి. సొంత కూతురిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. సభ్య సమాజం తలదించుకునే ఈ ఘటన కర్నూలు జిల్లా బనగానపల్లెలో జరిగింది.
కన్నకూతురిపై తండ్రి అత్యాచారం