Accident: కర్నూలు జిల్లా కోడుమూరు మండలం ప్యాలకుర్తి వద్ద ఇవాళ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగిఉన్న లారీని కారు ఢీకొన్న ఘటనలో.. తండ్రీకొడుకులిద్దరూ మరణించారు. పత్తికొండకు చెందిన మహమ్మద్ (75), హుసేన్ (35) తండ్రికొడుకులు. వీరిద్దరూ హైదరాబాద్లో ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే.. మహమ్మద్ పింఛన్ కోసం వారు స్వగ్రామం వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పోస్టమార్టం నిమిత్తం మృతదేహాలను కోడుమూరు పీహెచ్సీకి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆగిఉన్న లారీని ఢీకొన్న కారు.. తండ్రీకొడుకులు దుర్మరణం! - కర్నూలు జిల్లా ప్యాలకుర్తిలో రోడ్డు ప్రమాదం
Accident: కర్నూలు జిల్లా కోడుమూరులో జరిగిన రోడ్డు ప్రమాదం.. తండ్రి కొడుకులను ఆ కుటుంబానికి దూరం చేసి తీవ్ర విషాదాన్ని నింపింది. ఆగి ఉన్న లారీని వీరు ప్రయాణిస్తున్న కారు ఢీకొనటంతో ప్రమాదం చోటు చేసుకుంది.
స్వగ్రామానికి వస్తూ తిరిగిరానిలోకాలకు చేరిన తండ్రి కొడుకు
TAGGED:
ap latest news