కర్నూలు జిల్లాలో విత్తనాల కోసం పడిగాపులు గాస్తున్న రైతులు
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో శనగ రాయితీ విత్తనాల పంపిణీ కేంద్రంలో సర్వర్ మొరాయించింది. విత్తనాల కోసం వచ్చిన రైతులు పంపిణీ కేంద్రం వద్ద నిరీక్షిస్తున్నారు. అధికారులు తమ సమస్యలను పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనలు చేపడతామన్నారు.