కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్‌కు రాష్ట్రంలోనే అతిపెద్ద పత్తి మార్కెట్‌గా పేరుంది. ఏటా దసరా సమయంలో సీజన్ ప్రారంభమయ్యేటపుడు నిత్యం 4 వేల మంది వరకు రైతులు మార్కెట్‌కు వస్తారు. రాయలసీమ జిల్లాలు సహా.. కర్నాటక నుంచి రైతులు ఇక్కడికి వచ్చి ఉత్పత్తులు విక్రయిస్తుంటారు. ఏటా 1500 కోట్ల వ్యాపారం ఇక్కడ జరుగుతుందంటే అతిశయోక్తి కాదు.
రూ.10 నుంచి 15కే నాణ్యమైన భోజనం..
రైతుల రద్దీ దృష్ట్యా తక్కువ ధరకే మంచి భోజనం అందించాలనే ఆలోచనతో నాలుగేళ్ల క్రితం ఈ మార్కెట్‌లో క్యాంటీన్ ఏర్పాటు( canteen at Adoni Agricultural Market) చేశారు. ఇస్కాన్ సహకారంతో ఏర్పాటుచేసిన ఈ క్యాంటీన్‌లో రూ. 10 నుంచి 15కే నాణ్యమైన భోజనాన్ని అందించేవారు. అలాంటి క్యాంటీన్‌ని గతేడాది అధికారులు మూసేశారు. దీంతో బయట భోజనం చేయడం వల్ల తమకు ఖర్చు పెరిగిపోతుందని రైతులు వాపోతున్నారు.