ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పాసు పుస్తకాలు ఇస్తారా? పెట్రోల్ పోసుకోమంటారా?' - కల్లూరులో పెట్రోల్ తో రైతల నిరసన

కర్నూలు జిల్లా కల్లూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఇద్దరు రైతులు పెట్రోల్ బాటిల్​తో నిరసన చేపట్టిన తీరు కలకలం రేపింది. తమ భూమికి సంబంధించిన పాసు పుస్తకాలు ఇవ్వకుండా అధికారులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ.. ఆత్మహత్య చేసుకుంటామని బాధితులు కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు.

'పాసు పుస్తకాలు ఇస్తారా..? పెట్రోల్ పోసుకోమంటారా..?'
'పాసు పుస్తకాలు ఇస్తారా..? పెట్రోల్ పోసుకోమంటారా..?'

By

Published : Feb 10, 2020, 10:22 PM IST

'పాసు పుస్తకాలు ఇస్తారా..? పెట్రోల్ పోసుకోమంటారా..?'

పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వకుండా ఎమ్మార్వో వేధిస్తున్నాడని ఆరోపిస్తూ.. కర్నూలు జిల్లా కల్లూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట బాధితులు పెట్రోల్,పురుగులమందు డబ్బాతో నిరసనకు దిగారు. తమకు న్యాయం జరగపోతే అక్కడే ఆత్మహత్యకు పాల్పడుతామని హెచ్చరించారు. మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఇద్దరు బాధితులు తమ ఐదెకరాల పొలానికి సంబంధించి పాసు పుస్తకాలు ఇవ్వకుండా ఒక సంవత్సరం నుంచి అధికారులు కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారివద్దనుంచి పెట్రోల్,పురుగుల మందు డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు. తమ సమస్య పరిష్కారం అయ్యే వరకు నిరసన చేపడుతామని సదరు బాధితులు స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details