కర్నూలు జిల్లాలో పప్పుశనగ విత్తనాలకోసం రైతులు ధర్నాచేశారు. నియోజకవర్గంలోని ఆస్పరి, హాలహర్వి, హోళగుంద, చిప్పగిరి మండలాల్లో అన్నదాతలకు విత్తనాలు అందజేస్తున్నారని కానీ... ఆలూరులో మాత్రం అధికారులు విత్తనాలు ఇవ్వటం లేదని రైతులు వాపోతున్నారు. సాగు చేసుకోవడానికి ఎంతో అనుకూలంగా ఉందని ఇలాంటి సమయంలో వ్యవసాయాధికారులు విత్తనాలు ఇవ్వకపోవడం బాధాకరం రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్నదాతలు ఆందోళన చేస్తున్నా వ్యవసాయ అధికారులు ఎవరు కూడా అందుబాటులో లేకపోవడం గమనార్హం. సీపీఐ రైతు సంఘం నాయకులు రైతులుకు మద్దతు పలికారు.
విత్తనాల కోసం కర్నూలు జిల్లాలో రైతులు ఆందోళన - కర్నూలు జిల్లాలో పప్పుశనగ విత్తనాలకోసం రైతులు ధర్నా
పప్పు శనగ విత్తనాలు ఇవ్వాలంటూ కర్నూలు జిల్లా ఆలూరులో రైతులు ఆందోళనకు దిగారు. అధికారులకు వ్యతిరేకంగా నినదించారు.
విత్తనాల కోసం కర్నూలు జిల్లాలో రైతులు ఆందోళన