వేసవిలో వచ్చే అకాల వర్షాలు.. భారీగా వీచే గాలులతో ఈ సారి ఉద్యాన పంటలు సాగు చేసే రైతులకు అపార నష్టం వాటిల్లింది. ఏప్రిల్ నెలలోనే రెండు సార్లు వీచిన గాలుల ధాటికి అరటి, బొప్పాయి, మునగ తదితర పంటలు నేలకొరిగాయి. కొద్ది రోజుల్లో పక్వానికి వచ్చిన అరటి గెలలు చెట్టునుంచి విరిగిపడ్డాయి. కాయలై ..కోతకు సిద్ధంగా ఉన్న మునగ పడిపోయి పాడైపోయింది.
పండ్లు కావాల్సిన బొప్పాయి చేజారింది. పెట్టుబడి రూపంలో వేల రూపాయలు వెచ్చించి సాగు చేసిన పంట.. అన్నదాతకు నష్టాన్ని తెచ్చిపెట్టింది. కర్నూలు జిల్లా నంద్యాల డివిజన్ పరిధిలోని మహానంది మండలంలో పలు గ్రామాల్లో 1500 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతన్నలు వేడుకుంటున్నారు.