తల్లి చేయని మేలు ఉల్లి చేస్తుందనే మాట అందరికీ తెలిసిందే.. అలాంటి ఉల్లిని సాగుచేసే రైతులకు కంట నీరే మిగుల్తోంది. ఇటీవల కురిసిన వర్షాలకు పంట భూమిలోనే సగం కుళ్లిపోయింది. మిగిలిన దిగుబడులనైనా అమ్ముకుందామంటే వ్యవసాయ విపణిలో సమస్యలు తలెత్తుతున్నాయి. వాహనాల్లో మూడు రోజుల పాటు నిల్వ ఉండటంతో నాణ్యత లోపించి తక్కువ ధర వస్తోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఉల్లిపై ఉరిమిన వరుణుడు.. పంట గొర్రెల పాలు - కర్నూలు ఉల్లి రైతుల కష్టాలు
కర్నూలు జిల్లాలో ఉల్లి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. వర్షాలతో సగం పంట నేలలోనే కుళ్లిపోయింది. మిగిలిన పంటకు సరైన గిట్టుబాటు ధరలు రావటం లేదు. కనీసం కూలీ ఖర్చులు సైతం రాకపోవటంతో... రైతులు ఉల్లిని కోయకుండానే వదిలేశారు. దీంతో పంటను గొర్రెలకు వదిలేశారు.
గొర్రెలకు ఉల్లి పంట
కర్నూలు జిల్లా ముడుమాల గ్రామంలో కాశీం 10 ఎకరాల్లో, ఈశ్వరయ్య 3 ఎకరాల్లో ఉల్లి సాగు చేశారు. పంట చేతికొచ్చే సమయానికి వర్షాలు కూరిశాయి. పంట పొలంలోనే కుళ్లి పోయింది. మరో దారి లేక గొర్రెలకు మేతగా వదిలేశారు.
ఇదీ చదవండి: తెలుగునాట వినోదాల వీచిక.. 'ఈటీవీ' రజతోత్సవ వేడుక