కర్నూలు జిల్లా నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్ మురళీకృష్ణ బదిలీని నిలిపివేయాలని వ్యవసాయ కూలీలు, రైతు సంఘాలు, వామపక్ష పార్టీల నాయకులు ఆందోళన చేశారు. పరిశోధనా స్థానం గేటు ముందు బైఠాయించి నినాదాలు చేశారు. ఈ క్రమంలో నూతన ఏడీఅర్గా బాధ్యతలు చేపట్టడానికి వచ్చిన డా. ఎన్.సి. వెంకటేశ్వర్లును అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను నిలువరించారు. ప్రాణాలు పోయినా సరే పరిశోధనా స్థానం భూములను కాపాడుకుంటామని వ్యవసాయ కూలీలు తేల్చి చెప్పారు.
ఏడీఆర్ బదిలీ నిలిపివేయాలంటూ నంద్యాలలో ఆందోళన - farmers, farmer leaders protest in nandhyala
కర్నూలు జిల్లా నంద్యాలలో రైతులు, రైతు సంఘాల నేతలు ఆందోళన చేశారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్ మురళీకృష్ణ బదిలీని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఏది ఏమైనా పరిశోధనా స్థానం భూములను కాపాడుకుంటామని రైతులు స్పష్టం చేశారు.
ఏడీఆర్ బదిలీని నిలిపివేయాలంటూ నంద్యాలలో ఆందోళన