తమ పొలాన్ని కొంత మంది వ్యక్తులు ఆక్రమిస్తున్నారని కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ఓ రైతు కుటుంబం పురుగుల మందు సీసాలతో ఆందోళన చేసింది. కర్నూలు సమీపంలోని దిన్నెదేవరపాడుకు చెందిన బడే సాహేబ్ తన నాలుగున్నర ఎకరాల పొలంలో మూడు ఎకరాలు అమ్మానని.... పొలం కొన్న వ్యక్తులు మిగిలిన ఎకరన్నర భూమిని దౌర్జన్యంగా తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని రైతు ఆరోపించారు. తనకు అధికారులు న్యాయం చేయాలని... లేక పోతే పురుగుల మందే దిక్కని రైతు కుటుంబసభ్యులు తెలిపారు.
పురుగుల మందు సీసాలతో రైతు కుటుంబం ధర్నా - kurnool dst collectarate taja news
కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు పురుగుల మందు డబ్బాలతో ఓ రైతు కుటుంబం ఆందోళకు దిగింది. తన పొలాన్ని దౌర్జన్యంగా కొందరు వ్యక్తులు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
faremrs famuly protest with pestisides bottiles due to kurnool dst