ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నంద్యాల వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని నిర్వీర్యం చేస్తే.. ఉద్యమం తప్పదు' - నంద్యాలలో రైతు సదస్సు

నంద్యాలకు గర్వకారణమైన వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని నిర్వీర్యం చేస్తే రైతు ఉద్యమం తప్పదని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథ రామిరెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో రైతు సదస్సు నిర్వహించారు.

Farmers Conference
నంద్యాలలో రైతు సదస్సు

By

Published : Dec 5, 2020, 3:56 PM IST

కర్నూలు జిల్లా నంద్యాలలో వైద్య కళాశాల ఏర్పాటును స్వాగతిస్తున్నామని... కానీ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం స్థానంలో దాన్ని ఏర్పాటు చేయడం ప్రభుత్వానికి ఏ మాత్రం తగదని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథ రామిరెడ్డి అన్నారు. నంద్యాలలో రైతు సదస్సు నిర్వహించారు. వైద్యకళాశాలను పట్టణంలోని మరోచోట నిర్మించాలని పేర్కొన్నారు. దీనిపై గ్రామాల్లో పర్యటించి రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు.

నంద్యాలలో రైతు సదస్సు

ఈ సదస్సులో పరిశోధన కేంద్రం పరిరక్షణ, పంట నష్టపరిహారం, దిల్లీలో రైతుల దీక్ష, వారసత్వ సంపద, కేసీ కాలువ, తదితర అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో రైతులు, రైతు సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details