పత్తి కొనుగోలు చేయడంలో సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఇండియా) అధికారుల తీరును నిరసిస్తూ రైతులు, రైతు సంఘాల నాయకులు ధర్నా చేపట్టారు. కర్నూలు జిల్లా నంద్యాల వ్యవసాయ మార్కెట్ యార్డు ఎదుట రహదారిపై బైఠాయించారు. రైతుల ఆందోళనతో రహదారిపై రాకపోకలు కాసేపు స్తంభించాయి. యాప్ క్లోజ్ అయిందని కొంతమంది రైతులకు చెందిన పత్తిని కొనుగోలు చేస్తామని అధికారులు తెలిపారు. మార్కెట్ యార్డుకు పత్తిని తెచ్చిన రైతులందరికీ న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. రైతులకు అన్యాయం జరిగితే ఒప్పుకోమని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు పుల్లా నరసింహ, రైతులు హెచ్చరించారు. సీసీఐ అధికారులు అందరి పత్తిని కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.
పత్తిని కొనుగోలు చేయాలని రైతుల ఆందోళన
కర్నూలు జిల్లా నంద్యాల వ్యవసాయ మార్కెట్ యార్డు ఎదుట రైతులు బైఠాయించారు. పత్తి కొనుగోలు చేయడంలో సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఇండియా) అధికారుల తీరుకు వారు నిరసన తెలిపారు. రైతులందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
పత్తిని కొనుగోలు చేయాలని రైతుల ఆందోళన